GNTR: దీపావళి పండుగను పురస్కరించుకొని బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేసే విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ స్పష్టం చేశారు. బాణాసంచా విక్రయాలపై శనివారం గుంటూరు కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. ఫైర్, పోలీస్, రెవెన్యూ విభాగాలు సంయుక్తంగా తనిఖీలు చేసి అనుమతులు ఇవ్వాలని చెప్పారు.