ELR: తుఫాన్‌తో కురిసిన భారీ వర్షాలతో మండల వ్యాప్తంగా నష్టాలకు గురైన ఇళ్లకు సంబంధించి వివరాలను సేకరిస్తున్నట్లు కొయ్యలగూడెం తహసీల్దార్ చెల్లన దొర తెలిపారు. మండలంలో 6చోట్ల ఇళ్లకి నష్టం వాటిల్లినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇళ్లకు సంబంధించి జరిగిన నష్టాల వివరాలను ఇంకా నమోదు చేసుకోవాల్సిన వారు ఉంటే సోమవారం తహశిల్దార్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.