సత్యసాయి: చిలమత్తూరు తహసిల్దార్ కార్యాలయం వద్ద ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాబావాలి మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న ఫీజ్ రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదల చేయాలని, జీవో నెంబర్ 77 రద్దుచేసి పీజీ చదివే ప్రతి విద్యార్థికి స్కాలర్షిప్, ఫీజ్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చామన్నారు.