CTR: పుంగనూరు – రామసముద్రం ప్రధాన రహదారి మార్గంలోని హంద్రీ-నీవా కాలువ వద్ద తారరోడ్డు గుంతలతో నిండింది. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ మార్గం మరింత అధ్వానంగా మారింది. రోడ్డుపై ఉన్న గుంతలు వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రమాదాలకు గురవుతున్నట్లు వాహనదారులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.