ప్రకాశం: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని కోరుతూ ఈనెల 25న ఒంగోలు కలెక్టరేట్ వద్ద తాళిబజావ్ పేరుతో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ సైదా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు.