VSP: ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా సరఫరా చేయాలని సీపీఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. అలాగే కార్మిక సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. అక్టోబర్ 4న రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు మదిలపాలెంలో గోడపత్రిక ఆవిష్కరించారు.