కోనసీమ: మండల స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన ప్రతి అర్జీకి నిబంధనల మేరకు పరిష్కార మార్గాలు చూపాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఆత్రేయపురంలో సోమవారం మండల స్థాయిలో మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో సుమారుగా 99 అర్జీలను అర్జీదారుల నుండి రాత పూర్వకంగా స్వీకరించారు.