SKLM: మండల పరిధి అరసవిల్లిలో 25,26 డివిజన్లో శనివారం టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. టీడీపీ సభ్యత్వ నమోదు ఆత్మగౌరవానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. అలాగే అరసవిల్లిలో 50 నుంచి 60 రూ.కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు.