కృష్ణా: మోపిదేవిలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవు దినం కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. తొలుత నాగపుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొక్కుబడులు చెల్లించుకుని, స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు.