VZM: ఎస్.కోట మండలం రేగ పుణ్యగిరి చెందిన కొండపై నివసిస్తున్న గిరిజనులకు ఎన్నో ఏళ్ళుగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు ఇప్పించాలని ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారికి ఆమె స్వగృహంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులతో తగు న్యాయం చేస్తానని గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు.