ELR: కొయ్యలగూడెం మండలం పరింపూడిలో బుధవారం పొలం పిలుస్తోంది కార్యక్రమం నిర్వహించారు. మండల వ్యవసాయాధికారి చెన్నకేశవులు రైతుల పొలాలను సందర్శించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను, సబ్సిడీలను రైతులకు వివరించారు. అధిక దిగుబడులు సాధించడానికి చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యలను వ్యవసాయాధికారి చెన్నకేశవులు రైతులకు తెలియజేశారు.