కోనసీమ: ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక రవీంద్ర పాఠశాల్లో విద్యా సంస్థల ఛైర్మన్ పొత్తూరి లక్ష్మీ శ్రీనివాసన్ అధ్యక్షతన కళా సాహితి (లలిత కళల సేవా వేదిక) 18వ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత మహాకవులు గురజాడ, గుఱ్ఱం జఘవా, బోయి భీమన్న, తాపీ ధర్మారావు చిత్రపటాలకు పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు.