ప్రకసం: చీమకుర్తిలో గ్రానైట్ పాలిషింగ్ కంపెనీ నిర్వహిస్తున్న వెంకటేశ్వరరెడ్డి ఈ నెల 20న వ్యాపారం నిమిత్తం బయటకు వెళ్లారు. తరువాత ఆయన నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు. ఆయన సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. పలు ప్రాంతాల్లో ఆయన కోసం విచారించినా ఆచూకీ లేకపోవడంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.