WG: భీమడోలు గ్యాస్ గోడౌన్ రోడ్డు గోతులను సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఏలూరు వైపు నుంచి వచ్చేవారు గ్రామం లోపలికి రావాలంటే ఉపయోగించే ఈరోడ్డు భారీ గోతులు ఏర్పడడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. 2014-19 ప్రభుత్వంలో నాటి ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు హయాంలో నిర్మించిన ఈ రహదారి కాలక్రమేణా పెద్ద పెద్ద గోతులతో ఇబ్బందికరంగా మారిందని వాపోతున్నారు.