విక్టరీ వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని “సైంధవ్” తో రానున్నాడు. ఓరి దేవుడా సినిమాలో ప్రత్యేక పాత్రలో వెంకీ అలరించాడు. ఆ తర్వాత 75వ సినిమాను నేడు ప్రకటించారు. ‘హిట్2’ దర్శకుడు శైలేశ్ కొలను దర్శకత్వంలో వెంకీ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి రూపొందిస్తున్నారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
‘సైంధవ్’ అనే టైటిల్ తో పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో వెంకీ రఫ్ లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. వెంకటేష్ గన్ పట్టుకున్న తీరు చూస్తుంటే ఇదొక భారీ యాక్షన్ మూవీ అని తెలుస్తోంది. సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.