Hero Gopichand : గోపీచంద్ ‘రామబాణం’ ఫస్ట్ లుక్ టీజర్ రిలీజ్
మాచో స్టార్ గోపీచంద్(Gopichand) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామబాణం(Raamabaanam) అనే టైటిల్ తో సాగే సినిమా టీజర్(Movie Teaser) ను శివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మాచో స్టార్ గోపీచంద్(Gopichand) మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రామబాణం(Raamabaanam) అనే టైటిల్ తో సాగే సినిమా టీజర్(Movie Teaser) ను శివరాత్రి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకు శ్రీవాస్ దర్శకత్వం వహించనున్నాడు. ఇది వరకూ గోపీచంద్(Gopichand), శ్రీవాస్ కాంబోలో లక్ష్యం, లౌక్యం వంటి రెండు సినిమాలు వచ్చాయి. తాజాగా మరో హ్యాట్రిక్ ఫిల్మ్ రామబాణం(Raamabaanam) తెరకెక్కుతోంది. ఈ సినిమాను వరుస సంచలన విజయాలతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో గోపీచంద్ సరసన హీరోయిన్ గా డింపుల్ హయతి నటిస్తోంది. జగపతి బాబు, కుష్బూ ఇందులో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.
రామబాణం(Raamabaanam) సినిమాలో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపిచంద్ కనిపిస్తారు. మహా శివరాత్రి సందర్భంగా శనివారం సాయంత్రం రామబాణం(Raamabaanam) సినిమా ఫస్ట్ లుక్ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విక్కీస్ ఫస్ట్ యారో అనే పేరుతో రిలీజ్ చేసిన ఈ ప్రత్యేక వీడియో అందర్నీ ఆకట్టుకుంటోంది. ఇది పూర్తి యాక్షన్ ఫిల్మ్ కాదని, అద్బుతమైన వినోదభరిత సినిమా అని మేకర్స్ తెలిపారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు.
రామబాణం(Raamabaanam) సినిమా యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ లో గోపీచంద్(Gopichand) మేకోవర్, స్క్రీన్ ప్రజెన్స్ ప్రత్యేకంగా కనిపిస్తోంది. గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమాలో గోపీచంద్ కనిపించనున్నారు. గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ పై ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను తెరకెక్కించారు. లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన సినిమాల తర్వాత గోపీచంద్(Gopichand), శ్రీవాస్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను వేసవి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.