ఎట్టకేలకు యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni)ఏజెంట్(AGENT)మూవీ రిలీజ్ డేట్ ఫిక్సైంది. ఈ చిత్రం ఏప్రిల్ 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఎకె ఎంటర్టైన్మెంట్స్ ఓ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసింది. ఇక వీడియో అయితే మాములుగా లేదు. అఖిల్ ను అండర్ వేర్ పై ఓ కూర్చిలో తాళ్లతో కట్టేసి ఉంచడం చూడవచ్చు. మరోవైపు హీరోను టెల్ మీ దా నేమ్ పోలీసా అంటూ మరో వ్యక్తి ప్రశ్నిస్తాడు. రా ఏజన్సీ అంటూ పలు రకాల ప్రశ్నలు అడుగగా..అఖిల్ ఓసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్ పంపాడు బే అంటూ బిగ్గరగా అరుస్తాడు. ఆ క్రమంలో జరిగిన ఫైట్ లో అఖిల్ రక్తంతో తడిసిన ముఖంతో భయంకరంగా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం పూర్తిగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఈ మూవీకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, హిప్ హాప్ తమిజా సంగీతం అందిస్తున్నారు. ఏజెంట్ కథను వక్కంతం వంశీ రాశారు. ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తుండగా, మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా లెవల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ రసూల్ ఎల్లోర్, ఎడిటింగ్ నవీన్ నూలి చేశారు.