»Vivek Ramaswamy Resigned From The Post Of President
Vivek Ramaswamy: అధ్యక్షపదవి నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి
అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి తప్పుకున్నారు. అధ్యక్ష అభ్యర్థి కోసం జరిగిన ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Vivek Ramaswamy resigned from the post of President
Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష రేసు నుంచి భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి(Vivek Ramaswamy) వైదొలిగారు. అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం తాజాగా అయోవాలో ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ ఘన విజయం సాధించాడు. 51 శాతం ఓట్లతో ట్రంప్ ముందంజలో ఉండగా వివేక్ రామస్వామి కేవలం 7.7 శాతం ఓట్లతో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతో అధ్యక్ష రేసు నుంచి తప్పుకుంటున్నట్లు, ఇక తమ ప్రచారాన్ని నిలిపివేస్తున్నట్లు వివేక్ రామస్వామి వెల్లడించారు.
వ్యాపారవేత్త అయిన వివేక్ ఆయన వ్యాఖ్యలతో అమెరికన్లను ఆకట్టుకున్నారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించి అందరని ఆశ్చర్యపరిచారు. రిపబ్లికన్ అభ్యర్థిత్వం కోసం మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump)తో పోటీపడ్డారు. ఇమ్మిగ్రేషన్, అమెరికాకే తొలిప్రాధాన్యం వంటి అంశాలపై మాట్లాడి అక్కడి ప్రజలనను హోరెత్తించారు. మొదటి నుంచి డొనల్డ్ ట్రంప్‌కు అనుకూలంగానే ఉన్నారు. తాజాగా ఆయన అత్యుత్తమ అధ్యక్షుడంటూ వివేక్ కొనియాడారు. ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు మద్దతిస్తానని వివేక్ రామస్వామి అన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైతే తాను ఉపాధ్యక్షుడిగా ఉండేందుకు సిద్ధమని చాలా సార్లు ప్రకటించారు.