»The Telangana High Court Postponed The Hearing On The Release Of The Movie Vyuham
Vyuham: వ్యూహం చిత్రం విడుదలపై విచారణ వాయిదా
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన వ్యూహం చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. జనసేనాని పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచే విధంగా ఉందంటూ నారా లోకేష్ ఫిర్యాదు మేరకు కోర్టు ఈ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేసింది. తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.
Vyuham: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma) తెరకెక్కించిన వ్యూహం చిత్రం విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలీజ్ చేయాలంటూ నిర్మాత వేసిన పిటిషన్‌ను రివ్యూ చేసిన తెలంగాణ కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. గత కొంత కాలంగా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయిన వ్యూహం(Vyuham) మూవీ వీడియో క్లిప్స్ తమ పార్టీ నేతలను కించపరిచేలా ఉన్నాయని టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(Nara Lokesh) హైకోర్టులో పిటిషన్ వేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan)లను తప్పుగా చూపించారని ఈ పిటిషన్లో వ్యక్తపరిచారు. దీంతో సినిమాను తాత్కలికంగా నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సినిమాను విడుదల చేయాలంటూ వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా ఆయన వేసిన పిటిషన్ ను ఈరోజు విచారించింది. సినిమా సెన్సార్ సర్టిఫికెట్ తో పాటు రికార్డ్స్ ను కోర్టుకు సెన్సార్ బోర్డు సమర్పించింది. సెన్సార్ బోర్డు రికార్డును పరిశీలించిన పిదప విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. దాంతో ఈ విచారణను రేపటికి వాయిదా వేసింది. నారా లోకేష్ వేసిన పిటిషన్ ను విచారించిన సింగిల్ బెంచ్ ఈ నెల 11 వరకు విడుదలను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో చిత్ర నిర్మాత అప్పీల్ చేశారు.