»Ayodhya Ram Mandir Opening On January 22nd 2024 Champat Rai Said Devotees Not To Come
Ayodhya Ram mandir: జనవరి 22న రామమందిరం ప్రారంభం..భక్తులు రావొద్దని సూచన!
అయోధ్యలో రామమందిరం దాదాపుగా సిద్ధమైంది. వచ్చే నెల 22న గ్రాండ్ ఓపెనింగ్‌కు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో ఈ వేడుకకు భక్తులు భారీగా తరలిరానున్నారు. ఈ క్రమంలోనే జనవరి 22న అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ భక్తులను కోరారు. అయితే అతను ఎందుకు అలా చెప్పారో ఇక్కడ తెలుసుకుందాం.
Ram Temple opening on January 22nd 2024 champat rai said Devotees not to come
ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య(ayodhya)లో రామమందిరం(Ram mandir) నిర్మాణం పూర్తి కాబోతుంది. ఈ క్రమంలోనే జనవరి 22న మధ్యాహ్నం 11 గంటలకు ఈ ఆలయ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. రాంలాలా విగ్రహం కూడా సిద్ధంగా ఉండగా..ప్రధాని చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ఈరోజు కోసం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది రామభక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గర్భగుడి, విగ్రహం కూడా సిద్ధంగా ఉందని, మొత్తం ఆలయం పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టవచ్చని ఈ వేడుక రామమందిర్ ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్(champat rai) తెలిపారు. ఈ క్రమంలోనే ఆయన కీలక ప్రకటన చేశారు.
దేశంలోని సామాన్య పౌరులు దయచేసి ఆలయ ప్రారంభోత్సవం(జనవరి 22) రోజున అయోధ్యకు రావద్దని చంపత్ రాయ్(champat rai) కోరారు. ఎందుకంటే అయోధ్యకు ఆ రోజున చాలా మంది భక్తులు వస్తారని, రామ్‌లాలాను దర్శించుకోవడం అందరికీ సాధ్యం కాదని చంపత్ రాయ్ చెప్పారు. ఆ క్రమంలోనే భక్తులు(Devotees) తమ సొంత ప్రాంతాల్లో ఉండే రామాలయాన్ని దర్శించుకుని పూజల్లో పాల్గొనాలని సూచించారు. అయితే ఇప్పటికే ఆ రోజు అయోధ్యకు వెళ్లే భక్తులందరికీ ట్రస్ట్ కనీస వసతి కల్పిస్తుందని హామీ ఇచ్చారు.
మరోవైపు ఈ వేడుకకు ప్రపంచవ్యాప్తంగా(worldwide) పలు దేశాల భక్తులతోపాటు భారత్‌లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఇప్పటికే అనేక ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు అయోధ్యకు 100కుపైగా ప్రత్యేక రైళ్లను నడిపేందుకు కూడా రైల్వే శాఖ సిద్ధమైంది. దీంతోపాటు నగరంలో భారీగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతోపాటు డ్రోన్లను కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారు. వీటితోపాటు పార్కింగ్ కేంద్రాలు, భోజన శాలలు వంటి సౌకర్యాలను కూడా సిద్ధం చేస్తున్నారు.