»Hyderabad And Visakhapatnam Delhi Gold Rates On December 13th 2023
Gold rates: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్..తగ్గిన బంగారం ధర
దేశవ్యాప్తంగా పుత్తడి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈ క్రమంలో నేడు (డిసెంబర్ 13న) హైదరాబాద్, విశాఖ, విజయవాడలో బంగారం ధరలు ఎంత రేటు ఉన్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
hyderabad and visakhapatnam delhi gold rates on december 13th 2023
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కొనసాగుతున్న పరిణామాల నేపథ్యంలో పసిడి ధరల్లో(gold rates) హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌లో గోల్డ్ ధరలు, స్టాక్ మార్కెట్లపై కూడా ఆ పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు పుత్తడి రేటు 200 రూపాయలకుపైగా తగ్గింది. ఈరోజు ధరల ప్రకారం చూస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 తగ్గడంతో రూ.56,750కి చేరింది. మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 తగ్గడంతో రూ.61,910కి చేరువైంది. ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్ నగరంలో వెండి ధర కిలోకు రూ.77,700గా ఉంది. ఇక విశాఖపట్నంలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.5,675 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.6,191గా ఉంది. దీంతోపాటు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఉన్న బంగారం ధరలను ఇక్కడ చుద్దాం.
-ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,900 ఉండగా..24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,060
-చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,400
-హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,910
-విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,910
-ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750 ఉండగా…24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,910
-కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,910
-మదురైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.57,200 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.62,400
-పాట్నాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,800 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,960
-మంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,750 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,910
-నాసిక్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,780 ఉండగా… 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.61,940
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. గత కొన్ని వారాలుగా పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. దాదాపు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 60,000 ఉండగా.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.55,000గా ఉండేది. అయితే ప్రతి క్షణం బంగారం ధరలు మారుతూ ఉంటాయి. అందువల్ల బంగారం కొనుగోలుదారులు కొనుగోలు చేసే సమయంలో ప్రత్యక్ష ధరలను ట్రాక్ చేసుకుని గోల్డ్ రేటు ఎంత ఉందో తెలుసుకోవాలి. ప్రస్తుతం గోల్డ్ విషయంలో ప్రపంచంలో చైనా తర్వాత భారత్ రెండో అతిపెద్ద బంగారం వినియోగదారుగా ఉంది.