»The Oldest Tortoise Is This The Oldest Tortoise In The World
The oldest Tortoise: ప్రపంచంలో అత్యంత పురాతనమైన తాబేలు ఇదే?
ప్రపంచంలో పురాతన వస్తువులతో పాటు పురాతన జంతువులు కూడా ఉన్నాయి. ఎన్నో ఏళ్ల నుంచి జీవిస్తూ.. పురాతన తాబేలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న తాబేలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
The oldest Tortoise: ఈ భూమ్మీద ఎన్నో పురాతన వస్తువులు ఉన్నాయి. వీటితో పాటు ఎన్నో రకాల పురాతన జంతువులు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో జోనాథన్ తాబేలు ఒకటి. సెయింట్ హెలెనా ద్వీపంలో ఉండే ఈ తాబేలు ఈ ఏడాది తన 191వ పుట్టినరోజును జరుపుకుంది. 191 ఏళ్ల వయస్సున్న జోనాథన్ అత్యంత పురాతన తాబేలుగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఇది పుట్టిన తేదీ కచ్చితంగా తెలియదు కానీ 1882 నాటికి దాని వయససు కనీసం 50ఏళ్లు ఉంటుందని గిన్నిస్ రికార్డు సంస్థ అంచనా వేసింది. ఈ తాబేలు ఎప్పుడు కూడా అనారోగ్యానికి గురికాలేదని దీర్ఘకాల పశువైద్యుడు జో హోలిన్స్ తెలియజేశారు. దీనికి ఆహారంగా పండ్లు, కూరగాయలు మాత్రమే అందిస్తున్నారు. ఈ తాబేలును 1882లో అప్పటి గవర్నర్ విలియం గ్రే-విల్సన్‌కు బహుమతిగా సెయిషెల్స్ ఇచ్చారు. అయితే ఈ తాబేలు దాదాపుగా 200 నుంచి 250 ఏళ్లు జీవిస్తుందని అంచనా వేస్తున్నారు.