»Ashwini Vaishnaw Said Andhra Pradesh Kothavalasa Railway Station Development
Ashwini vaishnaw: కొత్త వలస రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ గా మార్చుతాం
కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లాలో పర్యటించిన క్రమంలో కీలక విషయం ప్రకటించారు. కొత్త వలస రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా మార్చబోతున్నట్లు చెప్పారు. దీంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు.
ashwini vaishnaw said andhra pradesh kothavalasa Railway Station development
ఏపీలోని విజయనగరం వాసులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్(ashwini vaishnaw) గుడ్ న్యూస్ చెప్పారు. కొత్త వలస రైల్వే స్టేషన్(kothavalasa Railway Station) ను వరల్డ్ క్లాస్ స్టేషన్ గా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. విజయనగరం జిల్లా వీలుపర్తిలో నిర్వహించిన వికాసిత భారత్ సంకల్ప యాత్రలో కేంద్ర మంత్రి పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు. అంతేకాదు కాశీ వెళ్లే రైలును కూడా ఈ కొత్తవలస స్టేషన్ మీదుగా నడపనున్నట్లు తెలిపారు. మరోవైపు విశాఖ-బెనారస్ రైళ్ల ఫ్రీక్వేన్సీని పెంచనున్నట్లు వైష్ణవ్ చెప్పారు. ఈ క్రమంలో సింహాచలం, కొత్తవలస సహా మారుమూల రైల్వేస్టేషన్లు కూడా అభివృద్ధి చెందుతాయన్నారు. గతంలో ప్రతి ఇంటికి నీరు కావాలంటే కొలాయి వద్దకు వెళ్లే వారని కానీ బీజేపీ ప్రభుత్వం చొరవ వల్ల ప్రస్తుతం ప్రతి ఇంటికి నీరు వస్తున్నట్లు వెల్లడించారు.
అయితే అమృత్ భారత్ స్టేషన్ పథకం (ABSS) కింద ఆంధ్రప్రదేశ్లోని 18 రైల్వేస్టేషన్లతో సహా దేశవ్యాప్తంగా 508 రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి ప్రధాని మోదీ ఇప్పటికే శంకుస్థాపన చేశారు. మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 18 స్టేషన్లను ఎంపిక చేయాలని నిర్ణయించారు. ఈ చొరవ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏపీ ప్రజలు చూడబోయే విశేషమైన మార్పులు, అభివృద్ధికి బీజీపీ ప్రభుత్వం నాంది పలికిందని మోదీ గుర్తు చేశారు. అంతేకాదు ఏబీఎస్ఎస్ కింద ప్రతి రైల్వే స్టేషన్కు విజనరీ మాస్టర్ప్లాన్ను లాంఛనప్రాయంగా రూపొందించడంతోపాటు కనీస అవసరాలకు మించి సౌకర్యాలను పెంచడానికి దశల వారీగా అమలు చేయనున్నారు.