»Arogyasree Services To Be Stopped In Ap Dues Should Be Paid Before 27th Of This Month
APలో నిలిచిపోనున్న ఆరోగ్యశ్రీ సేవలు..ఈనెల 27 లోపు బకాయిలు చెల్లించాలి
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్ కి ఆరోగ్య నెట్వర్క్ ఆసుపత్రులు లేఖ రాశాయి. బకాయిలు చెల్లించకపోతే ఈ నెల 27 నుంచి ఆరోగ్యశ్రీ క్రింద వైద్య సేవలు నిలిపివేస్తామని హాస్పిటల్స్ తేల్చిచెప్పాయి. రూ.1000 కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆసుపత్రులు పేర్కొన్నాయి.
ఏపీలో ప్రైవేటు ఆస్పత్రులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ (Arogyashri) బకాయిలు వెయ్యి కోట్లలకు చేరటంతో ఈ నెల 27లోపు చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. లేదంటే రోగులకు సేవలు కొనసాగించలేమని తెలిపింది.వివిధ చికిత్సలకు చెల్లించే ప్యాకేజీల ధరలు కూడా పెంచాలని డిమాండ్ చేస్తూ అసోసియేషన్ సోమవారం వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు(M.T. Krishnababu)కు లేఖ రాసింది. ‘నెట్వర్క్ ఆస్పత్రుల్లో కొన్ని ఆస్పత్రులు 60 నుంచి 90 శాతం ఆరోగ్యశ్రీపైనే ఆధారపడి ఉన్నాయి. బిల్లుల పెండింగ్‌తో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ట్రస్ట్ బకాయిపడ్డ రూ.1,000 కోట్లు వెంటనే చెల్లించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలి. 2013 నుంచి ఇప్పటి వరకూ ఆరోగ్యశ్రీ ప్యాకేజీలు పెంచలేదు.
వెంటనే వాటిని పెంచాలి. నెట్వర్క్ ఆస్పత్రుల (Network hospitals) సమస్యలు విన్నవించుకునేందుకు వెంటనే జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలి. మా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నవంబరు 27 తర్వాత నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడం కష్టం’ అని పేర్కొంది. ఇప్పటికే సెప్టెంబరులోనే సీఎం జగన్ (CMJagan) కు లేఖ రాశామని.. అయినా ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.వెయ్యి కోట్లు కాకుండా గడిచిన 45 రోజుల్లో సమర్పించిన బిల్లులు కూడా రావాల్సి ఉందన్నారు. ఈహెచ్ఎస్ బిల్లులూ (EHS Bills) బకాయిలున్నాయని, ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్పత్రులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. బిల్లుల పెండింగ్‌తో ఆర్థికంగా అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తోందని.. ట్రస్ట్ బకాయిపడ్డ రూ.1,000 కోట్లు వెంటనే చెల్లించి, సమస్యల పరిష్కారానికి సహకరించాలన్నారు. నెట్వర్క్ ఆస్పత్రుల సమస్యలు విన్నవించుకునేందుకు వెంటనే జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. చదవండి : Rain Alert: ఏపీకి రెయిన్ అలర్ట్..భారీ నుంచి అతి భారీ వర్షాలు