»Actor Ms Chowdary Exclusive Interview With Dev Tompala Pawan Kalyan Prabhas Saalar
MS Chowdary: సలార్‌లో ఆ ఒక్క సీన్ కోసం రూ.50 కోట్లు ఖర్చుపెట్టారు..ఇంటర్వ్యూ
థియేటర్ ఆర్టిస్ట్ నుంచి సినిమాల వరకు నటుడు ఎమ్ఎస్ చౌదరి ప్రస్థానం, ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులను 'హిట్ టీవీ' ప్రేక్షకులతో ప్రత్యేక ఇంటర్య్వూలో పంచుకున్నారు.
Actor MS Chowdary Exclusive Interview With Dev Tompala Pawan Kalyan Prabhas Saalar
MS Chowdary: స్కూల్ నుంచే డ్రామాలు, కాలేజీలో కాంపీటేషన్లు, డిగ్రీ వచ్చే వరకు తానే రైటర్‌గా, డైరెక్టర్‌గా స్టోరీలు రాసి నాటకాలు వేసేవాడినని, అలా మొదలైన తన ప్రస్థానం నేడు సినిమా వరకు వచ్చిందిన ఎమ్ఎస్ చౌదరీ తెలిపారు. విజయవాడ నుంచి ఇండస్ట్రికి రావడం తనకు పెద్ద కష్టం ఏమి కాలేదని, కానీ అందరిలాగే సినిమా ఇబ్బందులు పడ్డట్లు చెప్పారు. యుద్ధం చేయడం చేతకాకుండా యుద్ధంలో దిగితే ఏం జరుగుతుందో, ఇప్పుడొస్తున్న చాలా మంది యువకుల పరిస్థితి అలానే జరుగుతుందని వెల్లడించారు. ఇది గ్లామర్ ప్రపంచం, ఇక్కడ ట్యాలెంట్ లేకుండా ఎక్కువకాలం ఉండలేమన్నారు. మన సక్సెస్ మాత్రమే మనల్ని నిలబెడుతుందని, దాని కోసం ప్రతి రోజు ప్రయత్నిస్తూనే ఉండాలని తెలిపాడు. హైదరాబాద్ లో ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఈటీవి అని.. మొదట్లో చాలా క్రైమ్ సీరియల్లో నటించానని పేర్కొన్నారు. అలౌకిక, నమ్మలేని నిజాలు, చిలసౌ స్రవంతి లాంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించడంతో మాస్ ఫాలోయింగ్ బాగా వచ్చిందన్నారు. ఇక సినిమా విషయానికి వస్తే.. లక్ష్మీ సినిమా తన మొదటి సినిమా అన్నారు. తరువాత మహాత్మ సినిమాతో తన లైఫ్ మారిపోయిందన్నారు. ఆర్టిస్టుల నుంచి పెర్ఫార్మెన్స్ ఎలా రాబుట్టుకోవాలో వివరించారు. ఆయనకు ఇష్టమైన డైరెక్టర్ ఎవరో చెప్పారు. బహుబలి సినిమాలో ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కోసం కథ మొత్తం వివరించారని తెలిపారు. నాటకరంగంలో యంగ్‌స్టర్స్‌ను తీసుకురావాలని ఆయన ఏం చేశాడో తెలిపారు. కేవలం ఆరుగురితో మొదలైన ఆ ప్రస్థానం ఇప్పుడు ఏడువేల మంది ఉన్నారని వెల్లడించారు. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.