janasena party alliance with bjp in telangana assembly elections 2023
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీతో జనసేన పార్టీ పొత్తు కుదర్చుకుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి కొన్ని సీట్లను కూడా బీజేపీ కేటాయించనుంది. అయితే ఈరోజు బీజేపీ తొలి జాబితా విడుదల చేస్తుందని తెలుస్తుండగా..ఆ లిస్టులో 55 మందితో కూడిన పేర్లను బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సిద్ధం చేసింది. ఈ క్రమంలో ఏ సమయంలోనైనా మొదటి జాబితా విడుదలయ్యే ఛాన్స్ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తొలి జాబితాలో ముగ్గురు ఎంపీలకు చోటు కల్పించగా..అంబర్ పేట, ముషీరాబాద్ అభ్యర్థుల అంశం ఇంకా పెండింగ్లో ఉన్నట్లు తెలిసింది.