»The Jagan Government Gave Good News To Them Regularize The Contract Employees
Contract Employees: వారికి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్
ఏపీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేసినట్లు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని 10,117 మంది రెగ్యులరైజ్ అయ్యారు.
దసరా పండగ (Dasara Festivel) వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులకు (Contract Employees) భారీ గుడ్న్యూస్ చెప్పింది. ఏపీలోని కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ (Regularize) చేస్తూ సర్కార్ ఉత్తర్వులు విడుదల చేసింది. ఈమధ్యనే కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తూ ఏపీ సర్కార్ అసెంబ్లీలో బిల్లు పాస్ (Bil Pass) చేసిన సంగతి తెలిసిందే.
కాంట్రాక్ట్ ఉద్యోగుల (Contract Employees) క్రమబద్దీకరణ బిల్లుకు తాజాగా గవర్నర్ (Governer) అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) ఆమోదం తెలిపారు. దీంతో ప్రభుత్వం నుంచి గెజిట్ విడుదల అయ్యింది. ప్రభుత్వం గెజిట్ విడుదల చేయడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇకపై రెగ్యులర్ ఉద్యోగులుకు విధులు నిర్వహించనున్నారు. తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడంతో కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఏపీ వ్యాప్తంగా వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్ టైం కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వం వారిని రెగ్యులరైజ్ చేయడంతో వారంతా లబ్ధి పొందనున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో కూడా వీలైనంత మందికి మేలు చేసేలా 2014 జూన్ నెలకు ముందుగా ఐదేళ్ల సర్వీస్ ఉన్నవారికి మాత్రమే ఈ రెగ్యులరైజేషన్ ఉంటుందని గతంలో సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించినందుకు సీఎం జగన్కు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు.