»Dont Get Caught In The Social Media Cage My Friend Anand Mahindras Post On Social Media Is Currently Going Viral
Anand Mahindra: సోషల్ మీడియా వలలో చిక్కుకోవద్దు!
సోషల్ మీడియాను వాడేందుకు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఓ చిలుక కూడా తన ముక్కుతో టాబ్లెట్ స్క్రోల్ చేస్తున్న వీడియోను ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేశారు. ఇప్పుడు అది వైరల్ అవుతోంది.
Anand Mahindra On Video Of Garbage Dumping Near Gateway Of India
Anand Mahindra: చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రస్తుతం ఎవరి చేతుల్లో చూసిన స్మార్ట్ ఫోన్ కనిపిస్తుంది. మనం ఒప్పుకున్న ఒప్పుకోకపోయిన గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌ను స్క్రోలింగ్ చేస్తూ రోజంతా సోషల్ మీడియాలోనే ఉంటున్నాం. ఇలానే ఓ చిలుక ముక్కుతో టాబ్లెట్ ఉపయోగిస్తున్న వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. ‘చిలుకలు టచ్ స్క్రీన్లను బాగా అర్థం చేసుకోగలవు. ఇతర చిలుకలను చూసి నేర్చుకోవడం కూడా వాటికి బాగా తెలుసు. చిలుక అంటే అనుకరించడం. కానీ మీరు ఆ చిలుకకి చెప్పండి. ఇది మనుషుల అలవాటు. ఒకసారి సోషల్ మీడియాను మొదలుపెడితే ఇక దాని నుంచి తప్పించుకోవడం కష్టం. సోషల్ మీడియా వలలో చిక్కుకోవద్దు. జాగ్రత్తగా ఉండు మిత్రమా!’ అని పోస్ట్ చేశారు.
Parrots can understand touch screens & like watching other parrots. Sound familiar? Well ‘to parrot’ means to imitate. But please tell this parrot that once you begin imitating THIS habit of humans, there’s no escape from a different kind of ‘cage!’ https://t.co/6F7wCuK7jA
ఆనంద్ మహీంద్రా చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. మనుషులను అనుకరించడం మొదలుపెడితే.. మెరిసే స్క్రీన్లకు మీరు కూడా అతుక్కుపోతారు. ఏకధాటిగా స్క్రీన్‌ను స్క్రోల్ చేస్తారు. మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటారు. మీరు ఎప్పటికీ ఎవరితో సరిపోరని భావిస్తుంటారు. కాబట్టి స్క్రీన్‌ను టచ్ చేయండి. కానీ ఎక్కువగా అటాచ్ కావద్దు. మీ నియంత్రణలో మీరు ఉండండి. లేకపోతే స్క్రీన్‌ని కింద ఉంచి వెంటనే ఎగరడానికి వెళ్లండని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.