»Telangana Cm Kcr Gave Good News To Government Employees
Telangana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. 5 శాతం ఐఆర్‌తో పాటుగా పీఆర్సీ కమిటీని ప్రకటించడంతో ఉద్యోగుల్లో సంబరాలు నెలకొన్నాయి.
దసరా పండుగకు ముందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపు కోసం పే రివిజన్ కమిటీని (పీఆర్సీని) నియమించాలనే కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ కమిటీ చైర్మన్‌గా ఎన్ శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్), సభ్యుడిగా బీ రామయ్య (రిటైర్డ్ ఐఏఎస్)లను సీఎం కేసీఆర్ నియమిస్తూ ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పీఆర్సీ కమిటీపై ఉత్తర్వులు జారీ చేశారు. కమిటీ ఆరు నెల్లలోపు ఓ నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పీఆర్సీకి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, సిబ్బందిని సమకూర్చాలని ఆర్థిక శాఖను కూడా సీఎం కేసీఆర్ ఆదేశించింది. 5 శాతం మధ్యంతర భృతి (ఐఆర్)ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. 5 శాతం ఐఆర్ ప్రకటించడంతోపాటుగా పీఆర్సీ ప్రకటన కూడా వెలువడటంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కమిటీ ప్రకటన విడుదల కావడంతో ఉద్యోగుల్లో సంబరాలు మొదలయ్యాయి.