»X Sensational Decision During The Election Time Australia Remove Fake News Complaint Feature
X Scraps: ఎన్నికల సమయంలో X సంచలన నిర్ణయం!
ఎలాన్ మస్క్ X ఎన్నికల గురించి తప్పుడు సమాచారాన్ని నివేదించడానికి వినియోగదారులను అనుమతించే ఫీచర్‌ను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఓ లేఖ సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతోంది.
x sensational decision during the election time australia remove fake news complaint feature
త్వరలోనే ఆస్ట్రేలియా సహా అనేక దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఎక్స్ (గతంలో ట్విట్టర్) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల గురించి తప్పుడు సమాచారాన్ని నివేదించడానికి వినియోగదారులను అనుమతించే ఫీచర్‌ను నిలిపివేసిందని ఒక పరిశోధనా సంస్థ తెలిపింది. వినియోగదారులు రాజకీయాల గురించి తప్పుదారి పట్టించేదిగా భావించిన పోస్ట్ గురించి ఫిర్యాదు చేసే ఒక ఫీచర్‌ను 2021లో ప్రవేశపెట్టారు. 2022లో బ్రెజిల్, ఫిలిప్పిన్స్ లో కూడా ఈ ఫీచర్ ను పరిచయం చేశారు. ఆ తర్వాత X గత వారం డ్రాప్ డౌన్ మెను నుంచి రాజకీయాల కేటగిరీని తొలగించిందని రీసెట్.టెక్ ఆస్ట్రేలియా ప్రతినిధులు తెలిపారు. అయితే వచ్చే ఏడాది అమెరికా, ఆస్ట్రేలియాలో ఎన్నికలు ఉన్న క్రమంలో ఇలా నిర్ణయం తీసుకోవడం పట్ల పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో మాత్రమే తొలగించారని, యూరోపియన్ యూనియన్‌లో అందుబాటులో ఉందని తెలుస్తోంది. ప్రధాన ప్రజాభిప్రాయ సేకరణకు కొన్ని వారాల ముందుగానే రాజకీయాల గురించి తప్పుడు సమాచారాన్ని నివేదించే సామర్థ్యాన్ని ఆస్ట్రేలియన్లు కోల్పోవడం చాలా ఆందోళనకరమని ఆన్లైన్లో ఈ న్యూస్ చక్కర్లు కోడుతుంది.
ఇటీవల సంవత్సరాల్లో ఫేక్ సమాచారం వేగంగా వ్యాపిస్తుంది. ఇక ఎన్నికల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పాత వీడియోలను మార్పింగ్ చేసి మళ్లీ సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి ప్రచారం చేస్తుంటారు. అయితే వీటిని తగ్గించడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ప్రజలకు రాజకీయాల గురించి తప్పుడు సమాచారాన్ని నివేదించే మార్గాన్ని జోక్యాన్ని పరిమితం చేయవచ్చు. బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్‌ను 2022 చివరలో తీసుకున్నప్పటి నుంచి చాలా మంది ఉద్యోగులను తగ్గించారు. ఆ తర్వాత అనేక మార్పులు, నిర్ణయాలు తీసుకొస్తున్నారు.