టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై లోక్‌సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చర్చలేవనెత్తారు. ఆ సమయంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, గల్లా జయదేవ్ మధ్య మాటల యుద్ధం సాగింది. లోక్‌సభలో గల్లా జయదేవ్ ప్రసంగిస్తూ..తమ నేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. ఆయన అరెస్ట్ ఏపీలో చరిత్రలోనే బ్లాక్ డేగా నిలిచిందన్నారు. చంద్రబాబు రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశారన్నారు.
వైసీపీ నాయకులు చంద్రబాబును ఇబ్బంది పెట్టేందుకు అనేక ఎత్తుగడలు వేశాన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు డబ్బు అందినట్లుగా ఏ ఆధారాలు చూపలేదన్నారు. చంద్రబాబును వెంటనే విడుదల చేసేలా ప్రధాన మంత్రి చర్యలు తీసుకోవాలని గల్లా జయదేవ్ విజ్ఞప్తి చేశారు.
బీసీలు అంటే, ఈ సైకో పార్టీకి ఎంత చులకనా? స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై లోక్ సభలో కూడా అబద్ధాలు చెప్తున్న మిథున్ రెడ్డిని వారిస్తున్న రామ్మోహన్ నాయుడు పై, అరేయ్, ఒరేయ్, నువ్వు నాకు చెప్పేది ఏంటి రా అంటూ, రెచ్చిపోయాడు ఈ జగన్ రెడ్డి ఎంపీ, మిథున్ రెడ్డి.#TDPJSPTogether#APvsJagan… pic.twitter.com/7X1aui7CPZ
గల్లా జయదేవ్ ఆరోపణలను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారం పెద్ద కుంభకోణమన్నారు. అన్ని ఆధారాలతోనే చంద్రబాబును అరెస్ట్ చేసినట్లు తెలిపారు. టీడీపీ అధినేత అరెస్టులో ఏ రకమైన కక్ష సాధింపు లేదన్నారు. నకిలీ జీవోల సాయంతో రూ.371 కోట్లు చంద్రబాబు దోచుకున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన సూత్రధారి అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు.
చంద్రబాబు గారి అక్రమ అరెస్టును పార్లమెంటులో ప్రస్తావించిన గల్లా జయదేవ్ . రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసారని, స్కిల్ డెవలప్మెంట్ లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ కాకుండానే అరెస్టు చేశారని లోక్ సభలో ప్రస్తావించారు.#TDPJSPTogether#APvsJagan#IAmWithBabu… pic.twitter.com/vuVgOsgnZs