టీడీపీ మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు (Kakara Nookaraju) మరణించారు. అనకాపల్లి జిల్లా ఎస్.రాయవరం మండలం చినగుమ్ములూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన రెండు రోజుల క్రితం అనారోగ్యంతో విశాఖలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.
కాకర నూకరాజు మరణం పట్ల టీడీపీ నేతలు తమ సంతాపాన్ని ప్రకటించారు. ఆయన్ని చివరిసారిగా చూసేందుకు అభిమానులు ఆయన ఇంటికి తరలి వచ్చారు. కాకర నూకరాజు ఎమ్మేల్యేగా మూడు సార్లు గెలిచారు. 1985, 1989, 1994లో ఆయన వరుసగా విజయాన్ని పొందారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన నూకరాజు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై గొంతెత్తారు. బీజేపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.