»Jawan Breaches Rs 650 Cr Mark At Global Box Office Sells Over 9 7 Lakh Tickets In India On Day 7
Jawan: 7 రోజుల్లో 9.7 లక్షల టిక్కెట్లు, లాభం 360 కోట్లు, షారుక్ జవాన్ మ్యాజిక్ ఇదే
జవాన్ సినిమా వారం రోజుల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా పాటలు, బాక్సాఫీస్ రికార్డులు తదితరాల గురించి జనాలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఇంట్లో కూర్చొని ప్రమోట్ చేయడం ద్వారా షారుక్ కేవలం 7 రోజుల్లోనే 360 కోట్ల రూపాయల లాభం ఎలా సంపాదించాడనే దాని వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం.
Jawan: కేవలం నటనే కాదు, షారుక్‌ఖాన్‌ను అనుభవజ్ఞుడైన వ్యాపారవేత్తగా కూడా పరిగణిస్తారు. ఆయన నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై రూపొందిన జవాన్ సినిమాపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సినిమా వారం రోజుల్లోనే ఎన్నో రికార్డులు సృష్టించింది. ఈ సినిమా పాటలు, బాక్సాఫీస్ రికార్డులు తదితరాల గురించి జనాలు చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాని ఇంట్లో కూర్చొని ప్రమోట్ చేయడం ద్వారా షారుక్ కేవలం 7 రోజుల్లోనే 360 కోట్ల రూపాయల లాభం ఎలా సంపాదించాడనే దాని వెనుక ఉన్న బిజినెస్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం. షారుక్ ఖాన్ నటించిన జవాన్ విడుదలై 7 రోజులు అవుతోంది. ఈ ఏడు రోజుల్లో ఈ సినిమా రూ.660 కోట్లు రాబట్టింది. రిపోర్టుల ప్రకారం ఈ సినిమా వసూళ్ల పరంగా పఠాన్‌ను వెనక్కు నెట్టేసింది. అవును.. ఏడో రోజు వసూళ్లు కాస్త తగ్గుముఖం పట్టిన మాట వాస్తవమే. కానీ 7 రోజుల్లో ఎన్నో రికార్డులు సృష్టించిన సినిమాగా జవాన్ నిలిచింది.
#Jawan is all set to post a SENSATIONAL TOTAL in its *extended* Week 1… It’s a NEW BENCHMARK for #Hindi films… UNPRECEDENTED – UNIMAGINABLE… Thu 65.50 cr, Fri 46.23 cr, Sat 68.72 cr, Sun 71.63 cr, Mon 30.50 cr, Tue 24 cr. Total: ₹ 306.58 cr. #Hindi. #India biz. #Boxofficepic.twitter.com/gWIldgCMY1
జవాన్ పెట్టుబడి ఎంత?
షారుఖ్ ఖాన్, విజయ్ సేతుపతి, దీపిక, నయనతార నటించిన జవాన్ చిత్రం ఆయన గత చిత్రం పఠాన్ కంటే ఎక్కువ ఖర్చు చేశారు. పఠాన్ బడ్జెట్ రూ. 250 కోట్లు. జవాన్ కు రూ.300 కోట్లు పెట్టారని సమాచారం. మీడియా కథనాల ప్రకారం జవాన్ 7 రోజుల్లో 660 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అంటే వారం రోజుల్లో జవాన్ రూ.360 కోట్ల లాభాన్ని ఆర్జించింది.
9.7 లక్షల టిక్కెట్ల రికార్డు
జవాన్ మరొక రికార్డు కూడా నెలకొల్పింది. జవాన్ కేవలం 7 రోజుల్లో 9.7 లక్షల టిక్కెట్లను విక్రయించి సరికొత్త రికార్డు సృష్టించింది. PVR మల్టీప్లెక్స్ జవాన్ సినిమాకు సంబంధించిన 1.44 లక్షల టిక్కెట్లను విక్రయించగా, INOX 92 వేలకు పైగా టిక్కెట్లను విక్రయించింది. సినోపోలిస్ లో 44 వేలకు పైగా జవాన్ టిక్కెట్లు అమ్ముడయ్యాయి. లాభాలు, టిక్కెట్లు, బాక్సాఫీస్ వసూళ్లు తర్వాత ‘జిందా బందా’ పాట మరో రికార్డు నెలకొల్పింది. ఈ పాటలో షారుక్ ఖాన్ 1000 మంది మహిళా డ్యాన్సర్లతో డ్యాన్స్ చేస్తూ కనిపించారు. ఈ పాట చిత్రీకరణకు దాదాపు 15 కోట్లు ఖర్చు చేశారట. ఒకటి రెండు కాదు ఏడు రోజుల్లో ఎన్నో రికార్డులు సృష్టించి.. తనకు ఇంకా వయసుకాలేదని నిరూపించాడు జవాన్ షారుక్ ఖాన్.