Shriya Saran: హ్యాపీ బర్త్ డే ఎవర్ గ్రీన్ బ్యూటీ శ్రియా శరణ్..!
ఇప్పటికీ మహిళా ప్రధాన పాత్రలు చేస్తూ కనిపించే సీనియర్ నటి శ్రియా శరణ్. నిజానికి ఎవరికైనా వయసు పెరుగుతుంది కానీ అందం తగ్గిపోతుంది. కానీ శ్రియలో రోజురోజుకూ అందం, ఆకర్షణ పెరిగిపోతోంది. శ్రియ ఇప్పటికీ చాలా మంది హీరోలకు లీడింగ్ లేడీగా అవకాశాలు అందుకుంటోంది. ఆమె తన 22 సంవత్సరాల కెరీర్లో ఒక దశాబ్దానికి పైగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని, ముఖ్యంగా టాలీవుడ్‌ను శాసించింది.
శ్రియా శరణ్ మంచి డ్యాన్సర్. ఆమె సుప్రసిద్ధ డ్యాన్సర్‌గా మారాలని అనుకుంది కానీ అనుకోకుండా ఆమె నటిగా మారింది. తెలుగు చిత్రం ఇష్టం (2001)తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆమె తన మొదటి చిత్రం విడుదలకు ముందే తరుణ్ నటించిన నువ్వే నువ్వేతో సహా మరో నాలుగు చిత్రాలకు సంతకం చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన తొలి చిత్రం కూడా నువ్వే నువ్వే కావడం విశేషం. 2002లో నాగార్జున, ప్రభుదేవా, గ్రేసీ సింగ్‌లతో కలిసి నటించిన ‘సంతోషం’ సినిమాతో ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. అది ఆమె మొదటి కమర్షియల్ హిట్.
ఆ తర్వాత స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. నందమూరి బాలకృష్ణతో చెన్నకేశవ రెడ్డి, చిరంజీవితో ఠాగూర్, నాగార్జునతో నేనున్నాను సినిమాల్లో నటించింది. తుజే మేరీ కసమ్, ఎనక్కు 20 ఉనక్కు 18 / నీ మనసు నాకు తెలుసు వంటి చిత్రాలతో ఆమె హిందీలో కూడా అడుగుపెట్టింది. ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళంలో అనేక చిత్రాలను అంగీకరించిన తర్వాత ఆమె కెరీర్ ముందుకు సాగింది.
ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన ఛత్రపతితో శ్రియ మళ్లీ క్రీజ్ లోకి వచ్చింది. ఆ తర్వాత స్పెషల్ నంబర్స్ చేయడం మొదలుపెట్టి పాపులర్ ఐటెం గర్ల్‌గా కూడా మారింది. రజనీకాంత్, శంకర్ల శివాజీ మూవీతో ఆమెకు పెద్ద ఆఫర్ వచ్చింది. ఆమె ది అదర్ ఎండ్ ఆఫ్ ది లైన్‌తో పాటు కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్నైట్స్ చిల్డ్రన్‌తో ఆంగ్ల చిత్రాలలో కూడా అరంగేట్రం చేసింది. ఆమె మలయాళంలో కూడా పోక్కిరి రాజాతో అరంగేట్రం చేసింది. అక్కినేని ఫ్యామిలీ క్లాసిక్ మనం చిత్రాలతో పాటు గోపాల గోపాల, దృశ్యం, గౌతమి పుత్ర శాతకర్ణితో లీడ్ రోల్స్ ప్లే చేసింది. ఆమె గ్లోబల్ బ్లాక్ బస్టర్ RRRలో అజయ్ దేవగన్ సరసన కూడా కనిపించింది.