ఏపీ విద్యాశాఖ (Department of Education) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది. స్కూల్(School)కి విద్యార్థులు ఫోన్లను తీసుకురాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులు సైతం తమ ఫోన్లను తరగతి గదుల్లోకి తీసుకురాకూడదని ఆదేశించింది. తరగతి గదులకు వెళ్లే ముందు టీచర్లు తన ఫోన్లను ప్రధానోపాధ్యాయుడికి అందజేయాలని ఆదేశాలు (Orders) జారీ చేసింది. బోధనకు ఎలాంటి ఆటంకం రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయ సంఘాలు, ఇతర వర్గాలతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘించే ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా ప్రధానోపాధ్యాయులు, ఉన్నతాధికారులు చూడాలని ఆదేశించింది. టీచర్లు తోపాటు విద్యార్థులు తమ పూర్తి ఏకాగ్రత పాఠ్యాంశాల మీదనే ఉంఛాలన్న ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది ఏపీ విద్యా శాఖ. యునెస్కో (UNESCO) ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ ఆధారంగా విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ఇది దోహదపడుతుందని తెలిపింది పాఠశాల విద్యా శాఖ. ఇటీవల కాలంలో టెక్నాలజీ (Technology)పెరిగిపోవడంతో ప్రభుత్వ విద్యా సంస్దల్లో కూడా సెల్ ఫోన్ వాడకాన్ని ప్రభుత్వమే ప్రోత్సహించింది. అయితే ఎమిదో తరగతి విద్యార్దులకు మాత్రమే ప్రాథమికంగా ట్యాబ్ ల వాడకాన్ని ప్రభుత్వం సహకరించింది. ఇప్పటికే బై జూస్ వంటి కంటెంట్ లోడ్ చేసి, దాన్ని విద్యార్దులకు అందుబాటులోకి తీసుకువచ్చింది.