మన దేశంలో కొంతమందికి రోడ్డు దాటాలంటే జీబ్రా క్రాసింగ్ (Zebra crossing) అక్కర్లేదు. చేయి చూపించి ట్రాఫిక్‌ను పట్టించుకోకుండా రోడ్డు దాటుతుంటారు. దానివల్ల ట్రాఫిక్ జామ్ (Traffic jam) అవుతుంది. లేదా యాక్సిడెంట్లు జరుగుతాయి. మనలో చాలా వరకు ట్రాఫిక్‌రూల్స్ పాటించం. ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటుతం. వాహనాలకు అడ్డంగా కూడా నిర్లక్ష్యంగా వెళ్తుంటం. ప్రమాదాల బారిన పడుతుంటం. కానీ, ఇటీవల కొన్ని జంతువులు మాత్రం మనుషుల కంటే బాగా ట్రాఫిక్‌రూల్స్ (Traffic Rules) పాటిస్తున్నయ్. ఆవులు కుక్కలు, పిల్లలు వాహనాలు రానప్పుడు రోడ్డు దాటున్నయ్. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరలైన సంగతి తెలిసిందే.
తాజాగా జపాన్‌లో ఓ జింక (Deer) ట్రాఫిక్‌రూల్స్ పాటించింది. వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్న రోడ్డు దాటేందుకు రోడ్డు పక్కన నిలబడింది. వాహనాలు లేనప్పుడు రోడ్డు దాటింది. అది కూడా ఎక్కడ పడితే కాదు జీబ్రా లైన్స్ మీదుగా రోడ్డు దాటింది. దీనిని గమనించి ఒకరు వీడియో తీసి సోషల్‌మీడియా(Social media)లో ఈ నెల 26న షేర్ చేయగా, వైరల్‌గా మారింది. కేవలం ఒక్క రోజులోనే 7.7 మిలియన్ల మంది వీడియోను వీక్షించారు. పలువురు నెటిజన్లు వీడియోపై కామెంట్లు చేశారు. జంతువులకు ఉన్న బుద్ధి మనుషులకు లేదని అంటున్నారు. గ్రీన్ సిగ్నల్ (Green signal) పడే వరకు డీర్ అక్కడే ఉంటుంది. తరువాత మెల్లగా జీబ్రా క్రాసింగ్ మీద నడుచుకుంటూ రోడ్డు దాటి వెళ్లిపోతుంది.