AKP: ఫైర్ సేఫ్టీ గ్యాస్ సిలిండర్ పేలడంతో ఒకరు మృతి చెందినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. పరవాడ పాత మిల్లు వద్ద ఎం సూర్యప్రకాశ్‌రావు(45) టెక్నీషియన్‌గా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఫార్మా పరిశ్రమలకు సరఫరా చేసే గ్యాస్ సిలిండర్ల సర్వీసింగ్ చేస్తుంటాడన్నారు. ఆదివారం సిలిండర్‌లోకి గ్యాస్ నింపుతుండగా పేలడంతో తీవ్రంగా గాయపడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందాడు.