Movie teaser: గ్రాడ్యుయేట్ పాస్ అయిన హీరోకు జాబ్ చేయడం ఇష్టం ఉండదు. తండ్రి మాట కాదనకుండా ఇంటర్వ్యూలకు వెళ్లి వస్తుంటాడు. దీనికి తోడు ప్రేమ, వీటి నడుమ హీరోకు గోల్ ఏంటీ? ఏం సాధించాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందేనని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇంతకీ టీజర్ ఎలా ఉందంటే.. అప్పట్లో ఆనంద్ అనే చిత్రానికి ఓ మంచి కాఫీ లాంటి సినిమా అనే ట్యాగ్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నావ్ చిత్రం కూడా, ఓ వర్షకాలం సాయంత్రం బాల్కనీలో కూర్చొని కాఫీ తాగేంత కమ్మగా ఉంటుందని టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. అందరూ కొత్తవాళ్లే కావడంతో ఇంకా ఫ్రెష్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంది. చిన్న సినిమానా, పెద్ద సినిమానా అనే తేడా ఉండదు. కంటెంట్ నచ్చితే ప్రేక్షకులు భుజాన మోస్తారని ఇది వరకే చాలా సినిమాలకు రుజువైంది. ఈ సినిమా కంటెంట్ కూడా ప్రేక్షకులు భుజానా మోసేలా ఉంటుందని అనిపిస్తుంది. ఆగస్టు 25న విడుదల కాబోతుంది.
NVR ప్రొడక్షన్, SIDS క్రియేటివ్ వరల్డ్ బ్యానర్లపై నవీన్ కురవ, కిరణ్ కురవ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ఏం చేస్తున్నావ్’. యంగ్ డైరెక్టర్ భరత్ మిత్ర దర్శకత్వంలో విజయ్ రాజ్ కుమార్, నేహా పఠాని హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. మెలోడీ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ సంగీత సారధ్యంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పాటలు ఇప్పటికే విడుదలై శ్రోతల్ని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మూవీ టీజర్ విడుదల చేశారు.