Today Horoscope:ఈ రోజు మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ సమయంలో మంచి పని ప్రారంభించాలి. ఏ గడియ బాగుంటుంది. అనే వివరాలు తెలుసుకోవాలంటే హిట్ టీవీ వెబ్ న్యూస్లో ఉన్న రాశి ఫలాలు చూడగలరు.
మేష రాశి
మంచి అవకాశాలను ఈ రాశివారు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
వృషభ రాశి
ఇతరులకు ఇబ్బంది కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త తీసుకోవడం అవసరం. కొత్తగా పనులు చేపట్టకుండా ఉంటే మంచిది. ధైర్యసాహసాలతో నూతనకార్యాలు ప్రారంభిస్తారు.
మిథున రాశి
గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. అనవసర వ్యయ ప్రయాసలు ఉంటాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మానసిక ఆందోళనతో కాలం గడుపవలసి వస్తుంది. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి వస్తోంది. శారీరకంగా బలహీనులు అవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి
కళాకారులు, మీడియా రంగాలకు చెందిన వారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలను పొందుతారు.
సింహ రాశి
భోజనం వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లల పట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం మంచిదికాదు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా శ్రేయస్కరం. కొత్త పనులు ప్రారంభించరాదు.
కన్య రాశి
మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతనకార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు.
తుల రాశి
ఆరోగ్యం గురించి జాగ్రత్త పడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశీయాన ప్రయత్నాలకు మార్గం సుగమం అవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.
వృశ్చిక రాశి
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇచ్చినచో అనారోగ్య బాధలు ఉండవు.
ధనుస్సు రాశి
పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవం పొందుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.
మకర రాశి
విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి వస్తోంది. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశం ఉంటుంది. రుణ లాభం పొందుతారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి.
కుంభ రాశి
బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతనకార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
మీన రాశి
ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు, సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్యసాహసాలతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. శుభవార్తలు వింటారు.