»Krishna District Joint Collector Ideal Marriage Simple Register Marriage
Aparajita Singh : కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ వివాహం.. సింపుల్‌గా రిజిస్టర్ మ్యారేజ్
కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహం అత్యంత నిరాడంబరంగా సాగింది . రాజస్థాన్‌కు చెందిన దేవేంద్రకుమార్‌ను అపరాజిత సింగ్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
ఏపీ కేడర్‌కు చెందిన యువ ఐఏఎస్ అధికారిణి, ట్రైనీ ఐపీఎస్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆదర్శంగా నిలిచారు. రాజస్థాన్‌కు చెందిన అపరాజిత సింగ్(Aparajita Singh).. అదే రాష్ట్రానికి చెందిన ట్రైనీ ఐపీఎస్ దేవేంద్రకుమార్‌ను పెళ్లి చేసుకున్నారు. మచిలీపట్నం (Machilipatnam) కలెక్టరేట్లోని తన కార్యాలయంలో జిల్లా రిజిస్ట్రార్ సమక్షంలో వివాహం చేసుకున్నారు ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది సమక్షంలో అపరాజిత, దేవేంద్రకుమార్ (Devendra Kumar) పరస్పరం దండలు మార్చుకున్నారు. యూపీ కేడర్‌కు చెందిన దేవేంద్రకుమార్.. హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు.
వివాహం (Marriage) అనంతరం నూతన దంపతులు గుడ్లవల్లేరు మండలం వేమవరంలోని శ్రీకొండాలమ్మ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన వారు ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారిణిగా ఉన్నారు.. ఆమె ప్రస్తుతం కృష్ణా జిల్లా (Krishna District) జాయింట్ కలెక్టర్‌గా పని చేస్తున్నారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఏపీ కేడర్(AP Cadre)కు చెందిన మరో యువ ఐఏఎస్‌ల జంట వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్ నవీన్‌కుమార్‌ల వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వారి పెళ్లి వేడుక తిరుపతిలో జరగ్గా.. బంధు మిత్రులు, వివిధ శాఖల అధికారులు హాజర్యారు. నాగలక్ష్మి 2012 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్.. నవీన్‌కుమార్ 2019 ఐఏఎస్ బ్యాచ్ ఐఏఎస్ అధికారి. నవీన్‌కుమార్ ప్రస్తుతం జాయింట్ కలెక్టర్‌గా పనిచేస్తున్నారు.నూతన జంటకు కలెక్టర్ రాజాబాబు, కలెక్టరేట్ సిబ్బంది అభినందనలు తెలిపారు.