»Onion Price Likly To Tuch 60 70 Rupees Per Kg After Tomato Rate High
Onion Price:టమాటా బాటలోనే ఉల్లి.. త్వరలోనే సెంచరీ కొట్టే ఛాన్స్ ?
కొన్ని చోట్ల టమాట ధరల్లో ఉపశమనం లభించినా.. ఉల్లి ధర కూడా త్వరలో పెరుగుతుందన్న వార్తలు సామాన్యుల గుండెల్లో గుబులుపెట్టిస్తోంది. ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.28 నుంచి రూ.32 వరకు ఉంది.
Onion Price:దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొన్నిచోట్ల టమాటా కిలో రూ.120 పలుకుతుండగా కొన్నిచోట్ల రూ.200 దాటింది. కొన్ని చోట్ల టమాట ధరల్లో ఉపశమనం లభించినా.. ఉల్లి ధర కూడా త్వరలో పెరుగుతుందన్న వార్తలు సామాన్యుల గుండెల్లో గుబులుపెట్టిస్తోంది. ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందని ఓ నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం ఉల్లి ధర రూ.28 నుంచి రూ.32 వరకు ఉంది. ఆగస్టు చివరి నాటికి రిటైల్ మార్కెట్లో ఉల్లి ధర రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. సరఫరాలో కొరత కారణంగా వచ్చే నెలలో ఈ పెంపు కిలో రూ.60-70 వరకు పెరిగే అవకాశం ఉంది. క్రిసిల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ అండ్ అనలిటిక్స్ నివేదిక ప్రకారం.. ఇంత ధర పెరిగిన తర్వాత కూడా, ఈ పెరిగిన ధరలు 2020 గరిష్ట స్థాయి కంటే దిగువన ఉండబోతున్నాయి.
బహిరంగ మార్కెట్లో రబీ స్టాక్ ఆగస్టు చివరి నాటికి గణనీయంగా తగ్గుతుందని తద్వారా ధర ఇప్పటికంటే పెరుగుతుందని నివేదిక పేర్కొంది. లీన్ సీజన్ 15-20 రోజులు ఉంటుంది. ఈ సమయంలో మార్కెట్ లో సరఫరా తగ్గుతుంది. అక్టోబర్లో కొత్త ఉల్లి పంట వచ్చే సమయంలో మళ్లీ ధరలు తగ్గే అవకాశం ఉంది. అక్టోబర్-డిసెంబర్ పండుగ నెలలో ధరలలో హెచ్చుతగ్గులు స్థిరంగా ఉంటాయని నివేదికలో చెప్పబడింది. జనవరి నుండి మే వరకు పప్పులు, ధాన్యాలు, ఇతర కూరగాయలు ఖరీదయ్యాయి. ఈ సమయంలో ఉల్లి ధరలు ప్రజలకు ఉపశమనం కలిగించాయి.
ఉల్లి ధర తగ్గినందున రైతులు ఈసారి ఉల్లి సాగు తగ్గించారు. ఈ కారణంగా ఈ సంవత్సరం విస్తీర్ణం 8 శాతం తగ్గింది. ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తి సంవత్సరానికి 5 శాతం తగ్గుతుందని అంచనా. . వార్షిక ఉత్పత్తి 29 మిలియన్ టన్నులు (MMT) ఉంటుందని అంచనా వేయబడింది. ఇది గత సంవత్సరం కంటే 7% ఎక్కువ. అందువల్ల ఖరీఫ్, రబీలో ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పటికీ ఈ ఏడాది సరఫరాలో పెద్దగా కొరత ఏర్పడే అవకాశం లేదు.