తమిళనాడులోని కోయంబత్తూరు సర్కిల్ డీఐజీ పోలీస్ ఆఫీసర్ విజయకుమార్(Vijayakumar) ఈరోజు ఉదయం రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నారు. అయితే అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంటి అనే వివరాలు ఇప్పుడు చుద్దాం.
తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు(koyambattur) డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG) విజయకుమార్(Vijayakumar) శుక్రవారం జూలై 7న సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 45 ఏళ్ల ఐపిఎస్ అధికారి తేనికి చెందిన కోయంబత్తూరు పరిధిలోని డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈరోజు ఉదయం 6.50 గంటల ప్రాంతంలో రేస్‌కోర్స్ క్యాంపు కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం వాకింగ్‌కు వెళ్లిన విజయకుమార్ 6.45 గంటల ప్రాంతంలో క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. వ్యక్తిగత భద్రతా అధికారి తన పిస్టల్‌ను ఇవ్వాలని కోరగా, విజయకుమార్ కార్యాలయం నుంచి బయటకు రాగానే కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
దీంతో క్యాంపు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఇతర పోలీసులు(police) ఘటనా స్థలానికి చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కొన్ని వారాలుగా నిద్ర సరిగా పట్టడం లేదని, తీవ్ర మనోవేదనకు గురయ్యానని విజయకుమార్ తన సహోద్యోగులతో చెప్పినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. 2009లో ఐపీఎస్ అధికారి అయిన విజయకుమార్.. కాంచీపురం, కూడళ్లూరు, నాగపట్నం, తిరువారూర్లలో ఎస్పీగా పనిచేశారు. గత జనవరిలో కోయంబత్తూరు డీఐజీగా బాధ్యతలు చేపట్టారు.