Once again, the Russian jets chased away the American drones
ఉక్రెయిన్, రష్యా యుద్ధం(Ukraine, Russia war) గురించి అందరికి తెలిసిందే. ఇరు దేశాల ప్రధానాలు ఎక్కడా తగ్గడం లేదు. ఇదిలా ఉంటే సిరియాలో రష్యా జెట్ విమానాలు(Russian aircraft) మరోసారి అమెరికన్ డ్రోన్లను (American drones) వెంబడించాయి. డ్రోన్ల ధ్వంసం చేయాడానికి ప్రయత్నాంచాయి. డ్రోన్లను గమనించిన రష్యా సైన్యం వాటిని తమ జెట్ విమానాలతో దెబ్బతీసేలా చేశాయి. ఈ మేరకు అమెరికా వాయుసేన తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. గురువారం ఉదయం 9.30 ప్రాంతంలో సిరియాలో (Syria) ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌నకు (Islamic State jihadist group) సంబంధించి రహస్య ఆపరేషన్ చేస్తున్న తమ మూడు డ్రోన్లను రష్యాకు (Russia) చెందిన ఫైటర్ జెట్ విమానాలు వెంబడించాయని ఎయిర్‌ఫోర్స్ లెఫ్టినెంట్ జనరల్ అలెక్సస్ గ్రెన్కెవిచ్ (Alexus Grynkewich) తెలిపారు.
రష్యా విమానం ప్రమాదకరంగా ఓ డ్రోన్‌కు సమీపం నుంచి వెళ్లడంతోపాటు పారాచుట్లలో మంటలు రాజేసి ఎంక్యూ-9 (MQ-9) రీపర్ల పనితీరు సామర్థ్యాన్ని దెబ్బతీసేలా చేసిందని చెప్పారు. రష్యా సేనలు ఇలా చేయడం గత 24 గంటల్లో ఇది రెండోసారని వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 15న నల్లసముంద్రంలో అమెరికా నిఘా డ్రోన్‌ను రష్యా ఫైటర్ జెట్ ఢీకొట్టిన విషయం తెలిసిందే. ప్రొపెల్లర్ ధ్వంసం కావడంతో డ్రోన్‌ను అంతర్జాతీయ జలాల్లో అమెరికా కూల్చివేసింది. అంతకుముందు డ్రోన్‌పై ఫైటర్ జెట్లు ఇంధనాన్ని కుమ్మరించాయని యూఎస్ వాయుసేన తెలిపింది. ఐఎస్ఐ తీవ్రవాదాన్ని రూపుమాపడానికి మేము పనిచేస్తున్నామని ఇది విధినిర్వహణలో భాగంగా చేస్తున్నామని, ఇప్పటికైన రష్యా ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని పద్ధతిగా వ్యవహరించాలని కోరారు. ఇది కచ్చితంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపింది.