CTR: పూలు సాగు చేసిన రైతులకు ప్రభుత్వం ఎకరాకు పంట ప్రోత్సాహకం కింద రూ.8000 అందించనున్నట్లు ఉద్యాన అధికారి వరప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. బంతి, చామంతి, రోజా లాంటి విడి పూలు ధర పడిపోవడంతో రైతులు నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం ప్రోత్సాహకం అందివ్వనుంది. రైతులు తమ పరిధిలోని రైతు సేవా కేంద్రాలు నమోదు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.