అన్నమయ్య: రాయచోటిలో పోలీసు కార్యాలయంలో ప్రజాకవి యోగి వేమన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ‘విశ్వదాభిరామ వినుర వేమ’ సూక్తి ప్రతి ఇంటికీ ఆదర్శమని, వేమన పద్యాలు నేటి సమాజానికి మార్గదర్శకమని ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పాల్గొన్నారు.