Lionel Messi: లియోనెల్ మెస్సీ (Lionel Messi) ఫుట్ బాల్ దిగ్గజ ఆటగాడు. అర్జెంటినా నేషనల్ టీమ్‌కు కెప్టెన్.. బార్సిలోనా, ఇతర క్లబ్స్ తరఫున ఆడాడు. మారడోనా తర్వాత అర్జెంటీనా ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు ఆరాధ్య దైవంగా మారాడు. పసిఫిక్ దేశాల్ల ప్రతిష్టాత్మకంగా భావించే కోపా అమెరికా కప్‌ను 2021లో అర్జెంటీనాకు అందించాడు. గతేడాది ఫిపా వరల్డ్ కప్‌ను కూడా అందజేశాడు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫుట్ బాల్ ఆటకు గుడ్ బై చెబుతారని అంతా భావించారు.. మెస్సీ ప్రకటన చేయలేదు. తనలో శక్తి ఉన్నంత వరకు ఆడతానని పేర్కొన్నారు. ఈ రోజు మెస్సీ బర్త్ డే సందర్భంగా హిట్ టీవీ పోర్టల్ ప్రత్యేక కథనం.
2005లో అర్జెంటీనా తరఫున హంగేరీతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఫుట్‌బాల్ కెరీర్ స్టార్ట్ చేశాడు. సబ్‌స్టిట్యూట్ ప్లేయర్‌గా రాగా కేవలం 47 సెకన్ల పాటు మాత్రమే గ్రౌండ్లో ఉన్నాడు. హంగేరీ ప్లేయర్ మెస్సీ ( Messi)జెర్సీని పట్టుకొని లాగడంతో.. మెస్సీ మోచేతి ఆటగాడికి బలంగా తాకింది. దీంతో రిఫరీ మెస్సీకి ( Messi) రెడ్ కార్డ్ చూపించడంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తనదైన మార్క్ ఆటతో.. అర్జెంటీనా జట్టుకు ఆడి, విజయాలను అందించాడు.
అర్జెంటీనా తరఫున 175 మ్యాచ్‌ల్లో 103 గోల్స్ చేశాడు. అర్జెంటీనా తరఫున అధిక గోల్స్ చేసిన ఆటగాడిగా రికార్డ్ సృష్టించాడు. ఫుట్ బాల్ ఆటలో రెండో ఆటగాడిగా ఉన్నారు. బార్సిలోనా క్లబ్‌కు ఎక్కువ మ్యాచ్‌లను మెస్సీ ఆడాడు. 778 మ్యాచ్‌ల్లో 672 గోల్స్ చేశాడు. పారిస్ సెయింట్ జర్మన్ క్లబ్ తరఫున 75 మ్యాచ్‌ల్లో 32 గోల్స్ చేశాడు. ఇంటర్నేషనల్, ప్రైవేట్ పుట్ బాల్ క్లబ్స్ కలిపి 1028 మ్యాచ్‌ల్లో 807 గోల్స్ చేశాడు. అత్యధిక గోల్స్ చేసి రెండో స్థానంలో ఉన్నాడు.
మెస్సీకి ( Messi) 11 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు గ్రోత్ హర్మోన్ లోపం ఉన్నట్టు తెలిసింది. ఫుట్ బాల్ ప్లేయర్ కాలేడని వైద్యులు తెలిపారు. చిక్సిత చేసేందుకు అప్పట్లోనే నెలకు 900 డాలర్స్ ఖర్చయ్యేది. ఆ మొత్తం మెస్సీ (Messi) కుటుంబానికి చాలా ఎక్కువ.. మెస్సీ ( Messi) తండ్రితో ఉన్న బంధం వల్ల బార్సిలోనా ఫుట్ బాల్ క్లబ్ రంగంలోకి దిగింది. మెస్సీతోపాటు కుటుంబాన్ని స్పెయిన్ తరలించి చికిత్స చేయించింది. అలా బార్సిలోనా జట్టుకు మెస్సీ ( Messi) రుణపడిపోయాడు. చాలా ఏళ్లపాటు ఆ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు.