GDWL: ధరూర్ మండలం నెట్టెంపాడులో పాలకుల నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం పడకేసింది. గ్రామంలో ముఖ్యంగా ఒకటవ వార్డు బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో మురుగునీరు మొత్తం కుంటగా మారి డ్రైనేజీలో నిండుకుంది. సరైన డ్రైనేజీలు లేక మురుగు మొత్తం ఇళ్ల ముందుకు చేరడంతో కాలనీవాసులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాలకులు మారిన అభివృద్ధి జరగడం లేదని వాపోతున్నారు. అధికారులు దీనిపై స్పందించాలని కోరుతున్నారు.