BDK: పాల్వంచ మండలం 42వ డివిజన్‌కు చెందిన పెద్దలు, యువకులు, ఆశామహులు సోమవారం రాజకీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీలు కేవలం స్థానికులకు మాత్రమే టికెట్లు కేటాయించాలని తీర్మానించారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తాము తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి అన్ని రాజకీయ పార్టీలు గుర్తించాలని లేకపోతే ఎన్నికల్లో సహకారం ఉండదని స్పష్టం చేశారు.