సత్యసాయి: నల్లమాడ మండలం పులగంపల్లి వద్ద సిమెంట్ లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆదివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో పదిమందికి గాయాలు కాగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.