JGL: తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడంతో ఆటో కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, తన సొంత నిధులతో ఆటో డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ అందించాలని నిర్ణయించారు. వారి కుటుంబ సభ్యులకు కరీంనగర్ చెల్మెడ హాస్పిటల్లో ఉచిత వైద్యం అందించేందుకు ఆదివారం రోజున వారి ఆధార్ కార్డులు స్వీకరించారు.